డా. పెమ్మసాని ఇంపాక్ట్

ప్రజాసేవలో స్ఫూర్తిదాయక ఘట్టాలు
అభివృద్ధి పయనం

ఇప్పటివరకు సాగిన అభివృద్ధి ప్రయాణం
గుంటూరు అభివృద్ధి ప్రస్థానానికి కాలక్రమం

మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమం నుంచి విద్య మరియు సామాజిక అభివృద్ధి వరకు… 2024 నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన పురోగతిని తెలుసుకోండి.
మీడియాలో ప్రచారం

మీడియా

గుంటూరు జిల్లా అభివృద్ధిలో కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని ప్రయత్నాలు మరియు చొరవను వివరిస్తూ ప్రచురితమైన వార్త పత్రికల కథనాలు
మా కార్యక్రమాలు

డా. పెమ్మసాని గారు మంచి సమాజం
కోసం చేసిన కార్యక్రమాలు

డెంగ్యూ నియంత్రణ ప్రయత్నాలు: Wolbachia Program

డాక్టర్. పెమ్మసాని ICMR-VCRC ద్వారా Wolbachia Programకు మద్దతునిస్తున్నారు. ఇది Aedes aegypti దోమల ద్వారా వచ్చే డెంగ్యూ మరియు చికున్‌ గున్యా వ్యాప్తిని తగ్గిస్తుంది. వ్యాధి నియంత్రణకు అనుకూలమైన పరిష్కారాన్ని చూపుతుందని నిర్ధారించబడింది. సమాజ ఆరోగ్యం కోసం ఈ పరిశోధనకు మద్దతుగా డా. పెమ్మసాని గౌరవనీయ మంత్రికి అధికారికంగా లేఖ రాశారు.

చేతివృత్తిదారులు మరియు గ్రామ పరిశ్రమల పరిస్థితులను మెరుగుపరచడానికి రోడ్‌మ్యాప్

డాక్టర్ పెమ్మసాని “ఆత్మనిర్భర్ భారత్” విజన్ కింద చేతివృత్తిదారులను బలోపేతం చేయడానికి మరియు గ్రామ పరిశ్రమలను ఆధునీకరించడానికి వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ను ప్రతిపాదించారు . క్రాఫ్ట్ క్లస్టర్‌లను ఏర్పాటు చేయడం, పర్యావరణ అనుకూల ఉత్పత్తిని ప్రోత్సహించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం మరియు గ్లోబల్ రీచ్‌ను పెంచడానికి ఎగుమతి జోన్‌లను సృష్టించడం వంటి ముఖ్య కార్యక్రమాలను రోడ్ మ్యాప్ లో పేర్కొన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి గౌరవనీయులైన మంత్రికి డా. పెమ్మసాని అధికారిక లేఖ రాశారు.

భారతదేశంలోని మిర్చి పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు

గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని భారతదేశంలోని మిర్చి పరిశ్రమను పునర్నిర్మించడానికి సాహసోపేతమైన చొరవ తీసుకుంటున్నారు. ప్రపంచంలోని మిర్చి ఉత్పత్తిలో 40 శాతం వాటా కలిగిన అతిపెద్ద ప్రపంచ ఉత్పత్తిదారు మరియు ఎగుమతిదారు అయినప్పటికీ, భారతీయ రైతులు ధరల అస్థిరత, మౌలిక సదుపాయాలలేమి, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో నిరంతర సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకుగాను.. రైతుల ఆదాయాలను పెంచడమే కాకుండా, అధిక నాణ్యత, పోషకరమైన మిర్చి ఉత్పత్తుల కోసం గౌరవనీయులైన మంత్రికి డా. పెమ్మసాని విజ్ఞప్తి చేశారు. నాణ్యమైన మిర్చి ఉత్పత్తుల ద్వారా ప్రజారోగ్యాన్ని కూడా కాపాడొచ్చని వివరించారు.